- Step 1
ఒక వెడల్పాటి పాన్ లో నెయ్యువేసి వేడెక్కిన తరువాత మటన్ ముక్కలు, ఇంగువ వేసి రెండునిమిషాల పాటు వేయించాలి. తరువాత పెరుగు కలిపి మరలా కొద్దిసేపు వేయించాలి.
- Step 2
ఇప్పుడు ఉప్పు, కారం, పలావు ఆకు ఒకటి వేసి వేయించాలి. ఉడకటానికి కొద్దిగా నీరు కలపవచ్చు. గరమ్ మషాలా కూడా వేసి మటన్ కొద్దిగా మెత్తబడేదాకా ఉంచి యాలకుల పొడి,శొంఠిపొడి, కుంకుమపువ్వు, కారం, తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి కొద్దిసేపు ఉంచాలి.
- Step 3
ఇలా తయారైన మటన్ ను వేరుగా ఒకగిన్నెలోకి తీసికోవాలి, అదే పాన్లో రెండు లీటర్ల నీరుపోసి కొద్దిగా సోంప్ పొడి స్పూన్ గరం మషాలపొడి పలచని గుడ్డలో మూటకట్టి నీళ్లలో వేయాలి.
- Step 4
తరువాత బాస్మతీ బియ్యం కూడా వేసి సిమ్ లో బియ్యం పూర్తిగా కాకుండా సగం దాకా ఉడకనివ్వాలి. ఇది కూడా వేరుగా తీసుకొని (నీరు ఎక్కువగా ఉంటే వంపేయాలి.)
- Step 5
అదే పాన్లో అన్నము కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మటన్ ముక్కలు కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మరలా అన్నం, అన్నంపైన మటన్ ముక్కలు ఇలా అంతా అయిపోయేదాకా వేయాలి.
- Step 6
ఇపుడు సిమ్ లో పూర్తిగా అన్నం, మటన్ ఉడికేదాకా ఉంచి దించేటపుడు (అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవాలి) సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.