- Step 1
ఒక గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలపై మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. పది నిమిషాలయ్యాక పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె పోయాలి.
- Step 2
అందులో రొయ్యలు వేసి వేయించి తీసుకోవాలి. అదే నూనెలో దాల్చినచెక్కా, యాలకులూ, జీలకర్ర వేయించి ఉల్లిపాయముక్కలూ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
- Step 3
తరువాత అల్లం,వెల్లులి ముద్దా, తగినంత ఉప్పూ, కారం, ధనియాలపొడీ, పసుపూ, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
- Step 4
ఇందులో టొమాటో ముక్కలు వేసి కాసిని నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడికాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలు వేసి మంట తగ్గించాలి. అవి ఉడికాక దింపేస్తే చాలు.