- Step 1
చికెన్ శుభ్రం చేసికొని చిన్న ముక్కలుగా కోయాలి. చికెన్ కు పట్టించే మషాల దినుసులను మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ కు పట్టించి ఒక గంట సేపు రెఫ్రిజరేటర్ లో ఉంచాలి.
- Step 2
బియ్యంను కడిగి 15 ని. పాటు నానపెట్టి వడపోయాలి. అడుగు మందంగా గల వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యు వేసి వేడి చేయాలి.
- Step 3
గరం మసాలాలో చెప్పిన వస్తువులు మీ ఇష్టాన్ని బట్టి అలాగే కానీ లేక మొత్తం పొడిగా చేసి కాని వేయాలి . తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి.
- Step 4
ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించి తరిగిన కొత్తిమీర, పొదీనా ఆకులు వేసి కలపాలి.
- Step 5
తరువాత తరిగిన టమాటో ముక్కలు కలపాలి. తరువాత ఫ్రిజ్లో ఉంచిన చికెన్, పసుపు,కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, ఉప్పు వేసి 5 నుండి 10 ని.ల సేపు ఉంచి నానబెట్టిన బియ్యం కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి.