- Step 1
రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు అన్నింటినీ రొయ్యలకు బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
పాన్లో నూనె, నెయ్యు వేసి కాగాక దాల్చిన చెక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.
- Step 3
తరువాత మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్ట్,పచ్చి మిర్చి వేసి పచ్చివాసన పోయే దాకా రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాటోలు, మిగిలిన కారం, ధనియాల పౌడర్, పసుపు వేసి మంచి మషాలా వాసన వచ్చేదాకా వేయించాలి.
- Step 4
తరువాత తరిగిన కొతిమీర కొద్దిగా, తరిగిన పొదీనా ఆకులు వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మషాలా పట్టించిన రొయ్యలను కలపి రెండు నిమిషాలపాటు ఉంచాలి.
- Step 5
తరువాత బియ్యం, నిమ్మరసం, మూడు కప్పుల నీళ్ళు కలిపి బాగా కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి. రుచి కోసం కొత్తీమీర చల్లుకోవచ్చు.