- Step 1
పచ్చిపప్పు ఎండబెట్టి మెత్తగా మరపట్టించుకుంటే పిండి మెత్తగా వస్తుంది లేదా శనగపిండిని నమ్మకమైన సూపర్ బజార్లలో కొనుగోలు చేయాలి.
- Step 2
చిన్న చిన్న దుకాణాలలో బటానీ పిండి కల్తీ చేయగల అవకాశం ఉంది. లేదా నిల్వ ఉండి వాసన రావచ్చు.
- Step 3
తరువాత అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి మొత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
ఒక వెడల్పాటి పాత్రలో శనగపిండి, వరిపిండి,గ్రైండ్ చేసిన మిశ్రమం, తగినంత ఉప్పు, నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకొవాలి.
- Step 5
తరువాత స్టౌ వెలిగించి పాన్ కాని, బాణాలికాని పెట్టి సరిపడా నూనె పొసి నూనె వేడెక్కిన తరువాత ఈ పిండిని జంతికల గొట్టంలో రిబ్బన్ బిళ్ళను పెట్టి నొక్కాలి.
- Step 6
చక్కగా కాలిన తరువాత తీసుకోవాలి. న్యూస్ పేపర్ మీదకానీ టిస్యూ పేపర్లమీద కానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనెను పీల్చకుంటాయి.
- Step 7
ఆరనిచ్చి గాలి చోరని డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. లవంగాల పొడి ఇష్టం లేని వారు తీసివేయవచ్చు.
- Step 8
కారం ఎక్కువగా తినేవారు పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెంచుకోవచ్చు. లేక తగ్గించుకోవచ్చు.