- Step 1
మొదటగా క్యాలీఫ్లవర్ ను కాడలు లేకుండా పైన ఉండే గుబ్బలాంటి భాగాలును వేరు చేయాలి.
- Step 2
ఒక వెడల్పాటి పాత్రలో వేడినీరు పోసి అందులో కొంచెం కల్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కేలీఫ్లవర్ ముక్కలను (గుబ్బలుగా ఉన్న పైభాగాలు) అందులో వేసి కొంచెం సేపు ఉంచి బాగా కడగాలి.
- Step 3
తరువాత వీటిని చిల్లుల పాత్రలో వేసి పంపు కింద నీటి ధారలో ఒకటి రెండు నిమిషాలు ఉంచితే కేలిఫ్లవర్లోని మందుల అవశేషాలు, క్రిములు తొలగిపోతాయి.
- Step 4
ఇప్పడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని కేలిఫ్లవర్ ముక్కలను, తరిగిన పచ్చిమిరపకాయలను, వాము, అల్లం వెల్లులి పేస్ట్, కరివేపాకు శెనగపిండి, బియ్యంపిండి వేసి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పకోడీల పిండిలాగా కలుపుకోవాలి.
- Step 5
ఇష్టమున్న వారు కొద్దిగా గరమ్ మషాలా పౌడర్ కూడా కలుపుకోవాలి. మరీ జారుడుగానీ, మరీ గట్టిగాకానీ ఉండకూడదు.
- Step 6
తరువాత పొయ్యిమీద బాణాలీ పెట్టి తగినంత నూనెపోసి నూనె వేడెక్కిన తరువాత మనకు కావల్సిన సైజులో పిండిని తీసుకొని నూనెలో వేయాలి.
- Step 7
దోరగా కాలిన తరువాత తీసి టిస్యూ పేపర్ మీద కానీ, న్యూస్ పేపర్ మీదకానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది. వేడి వేడిగా తినాలి.