- Step 1
గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు అరచెంచా నూనె, కొద్దిగా ఉప్పూ, నూడుల్స్ వేసి మంట తగ్గించాలి.
- Step 2
కాసేపటికి అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లటినీళ్లలో వేసి రెండు నిమిషాలయ్యాక వడకట్టుకోవాలి. వాటిపై ఇంకో చెంచా నూనె వేసి ఓసారి కలపాలి.
- Step 3
ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లీ, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
- Step 4
నిమిషం తరవాత క్యాప్సికం తరుగూ, సోయాసాస్, రెడ్చిల్లీసాస్, వెనిగర్, టొమాటో కెచెప్, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలపాలి.
- Step 5
అన్నీ వేగాక తగినంత ఉప్పూ, మిరియాలపొడీ, ఉడికించిన నూడుల్స్ వేసుకుని బాగా కలిపి రెండుమూడు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.