- Step 1
ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లూ, కొద్దిగా ఉప్పూ, అరచెంచా నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక నూడుల్స్ వేయాలి. ఐదారు నిమిషాలకు అవి ఉడుకుతాయి.
- Step 2
అప్పుడు దింపేసి వెంటనే చల్లని నీటిలో వేసి తరవాత వడకట్టాలి. ఈ నూడుల్స్పై కాస్త నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి.
- Step 3
అది వేడయ్యాక వెల్లుల్లి తరుగూ, అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ, క్యారెట్ తరుగూ, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- Step 4
నాలుగు నిమిషాలయ్యాక తేనె, పీనట్బటర్, సోయాసాస్, వెనిగర్, చిల్లీగార్లిక్ సాస్, వేసి బాగా కలపాలి. కూరగాయ ముక్కలన్నీ కాస్త వేగాయనుకున్నాక నూడుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. వీటికి మసాలా బాగా పట్టాక దింపేస్తే చాలు.