- Step 1
ముందుగా పాన్ తీసుకుని అందులో చేప ముక్కల్ని వేసి నీళ్లు పోయాలి.తరువాత ఉప్పు వేసి బాగా ఉడకపెట్టాలి.
- Step 2
అవి చల్లారాక చేప ముక్కల్లో ముల్లు లేకుండా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టాలి.
- Step 3
తర్వాత అల్లం, పచ్చిమిరపకాయల్ని మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. పాన్‌లో నూనె పోసి సన్నని మంటపై నూనెను వేడి చేయాలి.
- Step 4
ఒక గిన్నె తీసుకుని అందులో చేప ముక్కల్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేయాలి.
- Step 5
అందులోనే అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు, కొత్తిమీర ఆకులు, కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
- Step 6
తరువాత ఉప్పు సరిపోనట్టు అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని వాటిని ఫింగర్ షేపులో చేసి గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిలో దొర్లించాలి.
- Step 7
అలా చేసిన ముక్కల్ని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకూ వేగించాలి.
- Step 8
ఫిష్ ఫింగర్స్ ఎక్కువ నూనెను పీల్చినట్టు అనిపిస్తే పేపర్ టవల్స్‌లో వేసి వాటికి పట్టిన అదనపు నూనెను డ్రై చేయొచ్చు. ఈ ఫిష్ ఫింగర్స్‌ను టొమాటో సస్స్ తింటే చాలా బాగుంటుంది.