- Step 1
ముందుగా తీపి చట్నీ చేసుకుందాం. ముందుగా గిన్నె తీసుకోని అందులో ఖర్జూరాల్లో గింజలు తీసేసి కత్తితో చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి.
- Step 2
ఖర్జూరా ముక్కలకు చింతపండు గుజ్జు పట్టిచి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గుజ్జులో మిగిలిన పదార్థాలన్నీ వేసి మిక్సీలో బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
మెత్తగా చేసుకున్న మిశ్రమాని స్టవ్ పెట్టి.. దగ్గరకు అయ్యాక దింపేయాలి.
- Step 4
తరువాత ఓ గిన్నెతీసుకోని అందులో కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, బాదం పలుకులు తీసుకుని అన్నింటినీ బాగా కలిపి పక్కకి పెట్టుకోవాలి.
- Step 5
బ్రెడ్ స్లైసుల్ని గుండ్రంగా కత్తిరించుకోవాలి. ఒక్కోదానిలో 1 1/2 చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి.. అర్థచంద్రాకారంలో వచ్చేలా తడి చేత్తో అంచుల్ని మూసేయాలి.
- Step 6
ఇలానే మిగిలినవీ అన్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించి బంగారం రంగు లోకి వచ్చాక తీసుకోవాలి.
- Step 7
వీటిని ఓ వెడల్పాటి పళ్లెంలో సర్దుకోవాలి. ఓ గిన్నెలో పెరుగు, కారం, కొద్దిగా ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి.
- Step 8
దీన్ని బ్రెడ్‌స్లైసులపై వేసి.. పైన తీపి చట్నీ కొద్దికొద్దిగా వేయాలి. చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరిపోతుంది. అప్పుడు బ్రెడ్ వడ తినడానికి రెడీ.