- Step 1
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 4
వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి తరువాత అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసి అన్నీ వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి.
- Step 5
ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి.
- Step 6
దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో 1 లేదా 2 విజిల్స్ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి.
- Step 7
చివరగా కొత్తిమీర,నిమ్మకాయ ముక్కలు, ఉల్లిగడ ముక్కలు తో తిన్నడానికి రెడీ.