- Step 1
బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్ అన్ని కలిపి నూనె లేకుండా బాండీలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అదే బాండీలో గిజలు తీసిన ఖర్జూరాలను వేసి మెత్తబడేవరకూ గరిట తో వేయించాలి.
- Step 3
తర్వాత కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. తరువాత వేయించి చల్లార్చిన ఖర్జూరాలను మిక్సీలో వేసి 1 రౌండ్ తిప్పి పక్కనుంచాలి.
- Step 4
వేయించిన నట్స్ కూడా మిక్సీలో వేసి పలుకులుగా చేసుకోవాలి.
- Step 5
తర్వాత ఖర్జూరాలు, నట్స్ రెండూ కలిపి మిక్సీలో తిప్పాలి.
- Step 6
తర్వాత ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టాలి.
- Step 7
ఈ లడ్డూలను కొబ్బరి తురుములో దొర్లించాలి. అప్పుడు టెస్టి…….. టెస్టి……లడ్డు తినడానికి రెడీ