- Step 1
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక.. ఉల్లితరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో శుభ్రం చేసుకున్న చికెన్ చేర్చుకోవాలి.
- Step 2
తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కబెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకుని మైదా పిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు, వేసి మెత్తగా మృదువుగా కలిపి పక్కనబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని సమోసాలు వత్తుకునేలా సిద్ధం చేసుకోవాలి.
- Step 4
సమోసా షేపులు చేసుకుని మధ్య చికెన్ స్టఫ్ నింపి.. అన్ని వైపులా క్లోజ్ చేస్తూ సమోసాలు ఒత్తుకోవాలి. ఇలా సమోసాలు ఒత్తుకున్నాక పక్కనబెట్టుకోవాలి.
- Step 5
ఆపై పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి దోరగా వేపి సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ సమోసాలను గ్రీన్ చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయాలి.