- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలకు అర స్పూన్ పసుపు, మిర్చి, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ఉప్పు చేర్చి నానబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోయాలి.
- Step 2
నూనె వేడయ్యాక మసాలా పట్టించిన మష్రూమ్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లి, టమోటా తరుగును చేర్చి దోరగా వేపాలి.
- Step 3
ఆపై పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, గసగసాల పేస్టును అందులో కలపాలి.
- Step 4
ఆపై గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి చేర్చి బాగా వేపుకోవాలి.
- Step 5
మిశ్రమం బాగా వేగాక.. ఫ్రై చేసుకున్న మష్రూమ్‌ను చేర్చి ఐదు నిమిషాల పాటు ఉంచి ఉప్పు చేర్చి దించేయాలి.
- Step 6
అంతే మష్రూమ్ మసాలా రెడీ అయినట్లే. ఈ మష్రూమ్ మసాలా చపాతీలకు సైడిష్‌గా టేస్ట్ అదిరిపోద్ది.