- Step 1
ముందుగా మస్టర్డ్ సీడ్స్ మరియు పచ్చిమర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకోవాలి.
- Step 2
తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి, మస్టర్డ్, పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు, మ్యారినేషన్ కోసం లిస్ట్ లో సిద్ధంగా ఉంచుకొన్నా పదార్థాలన్నింటినీ కూడా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి.
- Step 3
మ్యారినేషన్ చేసిన ఈ చికెన్ ను రిఫ్రిజరేటర్ లో ఒక గంట పాటు పెట్టాలి.
- Step 4
ఒక గంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో మస్టర్డ్ ఆయిల్ వేసి, అందులో షుగర్ కూడా వేయాలి. ఇది నూనెలో పాకంలా తయారవుతుంది. అందుకు మీడియం మంట పెట్టాలి. పంచదార కరిగే వరకూ, కలర్ బ్రౌన్ కలర్ మారే వరకూ కలియబెడుతుండాలి.
- Step 5
ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 5నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
- Step 6
ఇప్పుడు అందులో మ్యారినేటెడ్ చికెన్ వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
- Step 7
ఇప్పుడు అందులో పసుపు, కారం, రెండు టీస్పూన్ల్ వైట్ మస్టర్డ్ పేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిముసాలు వేగించుకోవాలి.
- Step 8
తర్వాత అందులో గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
- Step 9
తర్వాత పాన్ కు మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
- Step 10
కొంత సమయం తర్వాత పాన్ మూత తీసి, చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిందో లేదో నిర్ధారించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి.