- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లి ముద్ద పట్టించి అరగంటసేపు నాననివ్వాలి.
- Step 2
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక ఉల్లిముక్కలు, పసుపు వేసి చల్లారాక వీటికి పచ్చిమిర్చి చేర్చి ముద్దలా చేయాలి.
- Step 3
ఈ ముద్దను చికెన్ ముక్కలకు పట్టించాలి. పెరుగులో బాదంపొడి, ధనియాలపొడి కలిపి, ఈ మిశ్రమాన్ని కూడా చికెన్ ముక్కలకు పట్టించాలి.
- Step 4
మరో పాన్‌లో నెయ్యి వేసి వేయించాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పలావు ఆకులు వేసి వేపాలి.
- Step 5
ఆపై నానబెట్టిన చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి మూతపెట్టి మధ్య మధ్యలో కదుపుతూ సిమ్‌లో ఉడికించాలి. చికెన్ ఉడికాక దించేసి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.