- Step 1
ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి.
- Step 3
ఒక బాణలిలో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి, కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి.
- Step 4
అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి బాగా వేయించాలి.
- Step 5
ఆ తరువాత, అందులోనే నానబెట్టి ఉంచుకున్న పప్పు, రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలను కలిపి, తగినంత నీరు పోసి ఉడికించాలి.
- Step 6
పప్పు బాగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే గంగవాయిలు మామిడికాయ పప్పు రెడీ అయినట్లే...! దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.