- Step 1
శనగపప్పులో తగినంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా మితంగా ఉడికించుకోవాలి.
- Step 2
ఉడికించిన తరువాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి.
- Step 3
ఆ పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి.
- Step 4
ఈ మిశ్రమం చిక్కబడేవరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం గట్టిపడ్డాక స్టవ్ ఆర్పేయాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇంకొక పాత్రలో నీళ్లు, నెయ్యి, వేసి మరిగించాలి.
- Step 6
బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి.
- Step 7
ఇప్పుడు చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి.
- Step 8
ఉండలను చేయితో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగపిండి ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి.
- Step 9
ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి. అంతే కుడుములు రెడీ.