- Step 1
ముందుగా మటన్‌ను శుభ్రంచేసి కాస్త పసుపు, ఉప్పు చేర్చి కుక్కర్లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి.
- Step 2
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు చేర్చి దోరగా వేయించాలి.
- Step 3
ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి రెండు నిమిషాల పాటు వేపుకోవాలి.
- Step 4
తర్వాత ఉడికించిన మటన్ ముక్కల్ని చేర్చి.. అందులో ధని లపొడి, సన్నగా కోసిన టొమాటోముక్కలు వేసి కలపాలి.
- Step 5
టొమాటోలు మెత్తబడ్డాక కప్పు నీళ్లు పోసి ముక్క మెత్తబడేవరకూ ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికి నూనె తేలాక గరంమసాలా వేసి కలపాలి. ఇందులో పనీర్ చేసి ఐదు నిమిషాలుంచి..
- Step 6
చివరగా కొత్తిమీరతో అలంకరించి దించాలి. అంతే పనీర్ మటన్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, వేడి వేడి అన్నంలోకి మంచి రుచినిస్తుంది.