- Step 1
ముందుగా బియ్యంని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇంకో పాత్రలో అన్నికూరగాయలను సగానికి ఉడికించుకోవాలి.
- Step 3
తర్వాత స్టౌమీద పాత్ర పెట్టి, అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.
- Step 4
నూనె వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, వేసి కొన్నివేయించాలి.
- Step 5
వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఉడికించిన కూరగాయలు వేసి కలియబెట్టాలి.
- Step 7
తరువాత పెప్పర్ పౌడర్, గరం మసాలా, టమోటో, పసుపు, కారం,జీలకర్ర పొడి వేయాలి.
- Step 8
ఇవన్నిమగ్గిన తరువాత బాస్మతి రైస్ కూడా వేసి, రెండు, మూడు నిముషాలు ఫై చేయాలి.
- Step 9
ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి 15 నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే కాలీఫ్లవర్ పులావ్ రెడీ.