- Step 1
ముందుగా ఉడికించిన రైస్‌కు చిటికెడు ఉప్పు.. పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మెదపాలి.
- Step 2
అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 3
మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 4
స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు, బాదం తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.
- Step 6
కావాలంటే క్యారెట్ తురుము కూడా చేర్చుకోవచ్చు. అంతే రుచికరమైన హెల్తీ కర్డ్ రైస్ రెడీ