- Step 1
ముందుగా కుక్కర్లో కొద్దిగా బటర్ వేసి వేడి చేయాలి ఇందులో మసాలాలు వేసి ఉల్లి ముక్కలు జీడిపప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్‌లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- Step 3
అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. అందులోనే పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 4
తర్వాత టమోటో ముక్కలు వేసి మిక్స్ చేసి మూత మూసేయాలి.
- Step 5
మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
- Step 6
ఈ మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత మూత తీసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 7
ఈ పేస్ట్‌ను బ్లౌల్లోకి మార్చుకొని, ఉడికించాలి. దీనికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 8
ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా, పెప్పర్ పొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.
- Step 9
అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.