- Step 1
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లి ముక్కలను ఫ్రై చేయాలి అందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
క్యాప్సికమ్ ఫ్రై అవుతున్నప్పుడు, మధ్యలోనే పెప్పర్ పౌడర్, కొద్దిగా ఉప్పు, కారం లేదా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 4
క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగిన తర్వాత పాన్‌లో మష్రుమ్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 5
మూత పెట్టి మీడియం మంట మీద మరికొద్దిపేపు ఫ్రై అవ్వనివ్వాలి.
- Step 6
మష్రుమ్ మెత్తగా ఉడికినట్లైతే, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
- Step 7
అంతే టేస్టీ మష్రూమ్ డీప్ ఫ్రై రెడీ అయినట్లే.