- Step 1
ముందుగా కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
- Step 2
తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
- Step 3
అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి.
- Step 4
తర్వాత సరిపడా నీళ్ళు పోసం పోపు మొత్తం ఉడకనివ్వాలి.
- Step 5
అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి, కుక్కర్‌కు మూత పెట్టాలి.
- Step 6
ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- Step 7
5నిముషాల తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి చికెన్‌కు పెరుగు మిక్స్ చేయాలి.
- Step 8
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరో ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 9
అంతే స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా రైస్‌కు కాంబినేషన్‌గా సర్వ్ చేయాలి.