- Step 1
ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన బెట్టుకోవాలి.
- Step 2
ఒక బౌల్‌లో వెల్లుల్లి, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్‌ను కలపాలి.
- Step 3
అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
అరగంట తర్వాత నాన్ స్టిక్ పాన్‌ను లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో చేపముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
- Step 6
చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ...
- Step 7
వీటిని వేడి వేడి రైస్‌లోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే.