- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌కు ఉప్పు, పెప్పర్ వేసి ఉడికించి రోస్ట్ చేసుకోవాలి.
- Step 2
లేదా గ్రిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి వేయించాలి.
- Step 3
అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక సెకను వేగించుకోవాలి.
- Step 4
పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేపుకోవాలి.
- Step 5
పెప్పర్ రోస్ట్ చేసిన అందులో పెప్పర్ రోస్ట్ చేసి బోన్ లెస్ చికెన్ వేసి పోపుతో పాటు వేపాలి.
- Step 6
పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
- Step 7
మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు చిలకరించి మిక్స్ చేయాలి.
- Step 8
చివరగా ఫ్రైడ్ రైస్ మొత్తం మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించి మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు ఉండనిచ్చి దించేయాలి.
- Step 9
అంతే రోస్టెడ్ చికెన్ రైస్ రెడీ అయినట్లే.