- Step 1
ముందుగా నెయ్యి వేడిచేసి బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగాలు, అల్లం గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, కూరగాయలు ముక్కలు వేయాలి.
- Step 2
ఇవి కొంచెం ఉడికాక బియ్యం వేసి మరికాసేపు వేగించాలి.
- Step 3
తర్వాత మసాలా పొడి, పసుపు వేసి మళ్లీ కాసేపు ఉంచాక ఒకటిన్నర కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి.
- Step 4
ఉడికించిన గుడ్ల పెంకు తీసి గుడ్లని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- Step 5
మరోపాన్‌లో కొంచెం నెయ్యి వేడిచేసి కొద్దిగా ఉప్పు, మిరియాలు, పసుపు వేసి కొంచెం సేపు వేగించాలి.
- Step 6
దీన్ని ఉడికించిన పులావ్ అన్నంలో కలిపి వేడివేడిగా కడాయ్ చికెన్‌తో సర్వ్ చేయాలి.