- Step 1
మొదట స్టౌ మీద పాన్ పెట్టి, అది వేడయ్యాక అందులో ఒక టీస్పూన్ నూనె వేసి కాగాక ఓట్స్, పసుపు వేసి, మీడియం ప్లేమ్ మీద 4 నిమిషాలపాటు వేయించాలి.
- Step 2
వేగిన ఓట్స్‌ను గిన్నెలోకి తీసి అదే పాన్‌లో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
- Step 3
తర్వాత మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 4
ఉల్లి ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
- Step 5
ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఓట్స్‌ను వేసి, అందులో చక్కెర, ఉప్పు వేసి, బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి.
- Step 6
ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి మూత మూత పెట్టేయాలి.
- Step 7
తర్వాత మరో ఏడు నిమిషాల ఉడికించాలి.
- Step 8
ఓట్స్ మెత్తగా ఉడికాక కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి. ఓట్స్ మెత్తగా ఉడికాక కొత్తిమీర తరుగుతో అలంకరించి సర్వ్ చేయాలి.