- Step 1
ముందుగా గ్రేవీ బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసిన చేపముక్కలు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- Step 2
అందులోనే పచ్చిమిర్చి, కారం, ధనియాలపొడి, ఉల్లి తరుగు, జీలకర్ర వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి.
- Step 3
తర్వాత మరో పాన్‌లో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, యాలకుల పేస్ట్‌ను వేసుకోవాలి. ఇందులోనే చేపల ముక్కల మిశ్రమాన్ని కలపాలి.
- Step 4
మంటను బాగా తగ్గించి చేప ముక్కల్ని కాసేపు ఉడికించాలి.
- Step 5
ఉడికే ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా చేర్చి పెట్టుకోవాలి.
- Step 6
ఈ గ్రేవీ మరి చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లు చూసుకోవాలి.
- Step 7
చేపలు ఉడికిన తర్వాత కరివేపాకు, చింతపులుసు పోసి ఉడికించుకోవాలి.
- Step 8
చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫిష్ కర్రీ రెడీ.