- Step 1
ముందుగా వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో కాసేపు ఉంచి తర్వాత తీసి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో ఉల్లి, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి.
- Step 3
అందులో సన్నగా తరిగిన టమోటో, వంకాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేయాలి.
- Step 4
తర్వాత కొద్దిగా నీరు, కారం, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి, మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి, తర్వాత మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
- Step 5
పదినిమిషాల తర్వాత పూత తీసి, అందులో ముందుగా ఉడికించుకొన్న పచ్చిబఠాణీలను వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
- Step 6
అంతే గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి దించేయాలి. అంతే వంకాయ టమాటా కర్రీ రెడీ