- Step 1
ముందుగా కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
- Step 2
నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
- Step 3
తర్వాత అందులో అల్లం వల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఇందులో సన్నగా తరిగిన టమోటోలు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు.. మసాలా దినుసులు వేసి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 5
ఈ మిశ్రమంలోనే బంగాళదుంప ముక్కలు, ఎండుమిర్చి కూడావేసి తక్కువ మంట పై వేపుకోవాలి.
- Step 6
పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కడిగిపెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోసి ఒక్క విజిల్స్ వచ్చే వరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి.
- Step 7
విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగును గార్నిష్‌గా చిలకరించాలి.
- Step 8
ఈ రైస్‌కు చికెన్ గ్రేవీ సూపర్ కాంబినేషన్ అవుతుంది.