- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 2
అందులో ఉప్పు, బిర్యానీ ఆకులు, లవంగాలు కొద్దిగా మిరియాల పొడివేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 3
తర్వాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసంను ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- Step 4
అదే బౌల్లో పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత మరో బౌల్లో పాలు పోసి అందులో కొద్ది కుంకుమ పువ్వు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
- Step 6
అన్ని సిద్దం చేసి పెట్టుకొన్నాక, స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ, కొన్ని నిముషాల ఫ్రై చేసిన తర్వాత అందులో పనీర్ ముక్కలను వేయాలి.
- Step 7
బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి.
- Step 8
తర్వాత వెడల్పాటి పాన్ తీసుకొని అందులో ముందుగా వండి పెట్టుకొన్న రైస్ ఒక లేయర్‌గా వేసి పాన్ మొత్తం సర్ధాలి.
- Step 9
తర్వాత రైస్ లేయర్ మీద పనీర్‌ను కూడా వేసి, రైస్ మొత్త కవర్ అయ్యేలా సర్దాలి.
- Step 10
ఇప్పుడు దీని మీద ముందుగా ఉడికించి పెట్టుకొన్న పచ్చిబఠానీలు, గరం మసాలా పౌడర్, యాలకలపొడి, కుంకుమపువ్వు, పాలు, కొత్తిమీర, పుదీనా మరియు నెయ్యి వేయాలి.
- Step 11
ఇలా మొత్తం అన్నం, పన్నీర్ గ్రేవీ లేయర్స్‌గా సర్దుకుంటూ పూర్తి చేసుకొన్న తర్వాత మూత పెట్టి మరో 10 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకుని దించేయాలి.
- Step 12
అంతే పనీర్ బిర్యానీ రెడీ.. ఈ బిర్యానీకి కడాయ్ చికెన్ కాంబినేషన్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.