- Step 1
ముందుగా శుభ్రం చేసిన చికెన్‌ను కాసింత ఉప్పు, పసుపు చేర్చి ఉడికించుకోవాలి.
- Step 2
ఉడికాక చికెన్‌ను మెత్తగా చేతులో వత్తుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ చేర్చి ఉప్పు, లెమన్ జ్యూస్‌లతో పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అలాగే బ్రెడ్‌ను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మరో బౌల్‌లో కోడిగుడ్లను గిలకొట్టుకోవాలి.
- Step 5
స్టౌ మీద నూనె వేడయ్యాక బాల్స్‌గా చేసుకున్న చికెన్‌ను కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్‌లో పట్టించి.. కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి.
- Step 6
తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి చికెన్ బాల్స్ తీసుకుని కొత్తిమీర, ఆనియన్స్‌తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.