- Step 1
ముందుగా పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 2
ఉల్లి ముక్కలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్త మిశ్రమాన్ని మరో 5నిముషాలు వేగించుకోవాలి.
- Step 3
తర్వాత అందులో యాలకలు, దాల్చిన చెక్క కూడా వేసి మిక్స్ చేస్తూ సువాసన వచ్చే వరకూ వేగించుకోవాలి.
- Step 4
తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
- Step 5
మొత్తం మిశ్రమం బాగా వేగిన తర్వాత, అందులో ముందుగా కట్ చేసి ఉడికించి పెట్టుకొన్న చికెన్ ముక్కలు, కారం, గరం మసాలా, ధనియాలపొడి, జీలకర్ర, ఉప్పు, ఆకుకూర తరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసి, తర్వాత రెండు కప్పులు నీళ్ళు పోయాలి.
- Step 6
మూత పెట్టి, 5-10నిముషాలు మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. అంతే ఆకుకూర చికెన్ కర్రీ రెడీ.