- Step 1
ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను గిన్నెలో సరిపడా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత మరో పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్‌గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే పాన్‌లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
- Step 4
తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
- Step 5
కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
- Step 6
10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.
- Step 7
ఇది అన్నంలోకి, రోటీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.