- Step 1
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, జీలకర్రపొడి, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని ఒక గంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ముందుగా స్టౌ మీద డీప్ బాటమ్ పాన్‌లో పెట్టుకోవాలి. వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 4
గ్రేవీ తయారుచేసుకోవడం కోసం డ్రైఫ్రూట్స్‌ను ముందు రోజు రాత్రే నీటిలో వేసి నానబెట్టుకొని ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 5
ఈ పేస్ట్‌ను వేగుతున్న ప్రైలో వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
- Step 6
గ్రేవీ బ్రౌన్ కలర్ లోకి మారుతున్నప్పుడు అందులో పచ్చిమిర్చి ఉప్పు మరియు టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మటన్ ఉడికించుకోవాలి .
- Step 7
ఎక్కువ నీరు పోయకూడదు. మటన్ బాగా ఉడికి గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు అందులో ముందుగా నానబెట్టుకొన్న బ్రెడ్ వేసి మొత్తం గ్రేవీలో మిక్స్ చేయాలి.
- Step 8
ఇప్పుడు గుడ్డును పగలగొట్టి ఒక గిన్నెలోకి పోసుకొని, అందులో కొద్దిగా కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పాన్‌లో వేసి ఉడికించుకోవాలి.
- Step 9
ఉడికించుకొన్న గుడ్డును బేకింగ్ పాన్‌లో అడుగు బాగంలో సర్ది, దాని మీద ముందుగా ఉడికించుకొన్న మటన్‌ను వేసి సర్దాలి.
- Step 10
ఈ మటన్ మీద గిలకొట్టి పెట్టుకొన్న మిగిలిన గుడ్డు మిశ్రమాన్ని పోయాలి.
- Step 11
మిగిలిన నెయ్యికూడా వేసి మైక్రోవొవెన్‌లో పెట్టి 5-10 బేక్ చేసుకోవాలి. అంతే డాబా స్టైల్ గోస్ట్ రిసిపీ రెడీ అయినట్లే.
- Step 12
ఈ రిసిపీ రైస్ అండ్ రోటీలకు టేస్టీగా ఉంటుంది.