- Step 1
ముందుగా చికెన్ ముక్కలను నీటిలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో కాస్త నీళ్లు తీసుకుని కడిగిన చికెన్’ను అందులో వేయాలి. దీనిని 10 నిముషాల వరకు స్టౌవ్ మీద ఉడికించి పెట్టుకోవాలి.
- Step 3
ఉడికిన తర్వాత నీటిని పడేసి.. చికెన్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మరొక గిన్నెలో నూడిల్స్ తీసుకుని, అందులో సరిపడా నీటిని పోసి ఉడికించుకోవాలి.
- Step 5
ఉడికిన అనంతరం నీటిని పడేసి, ఆ వేడి నూడిల్స్’లో కాస్త చల్లనీళ్లు పోసి, కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఒక పెద్ద నాన్’స్టిక్ తవా తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి.
- Step 7
నూనె వేడయిన అనంతరం అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
- Step 8
అలా కొద్దిసేపు వేడి చేసుకున్న తర్వాత అందులో తెల్లఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సిమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. మీడియం మంటమీద మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి.
- Step 9
అలా వేగుతున్నప్పుడే అందులో ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 10
బాగా వేడెక్కిన అనంతరం అందులో ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటో సాస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
- Step 11
చికెన్ వెజిటేబుల్స్ తో బాగా కలగలిపి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 12
చికెన్ ఉడికిన తర్వాత చివరగా గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేయాలి.
- Step 13
తర్వాత ఉడికించిన నూడిల్స్ కూడా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
- Step 14
అంతే.. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్’ను ఎంతో సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.