- Step 1
ముందుగా అటుకులను నీటిలో బాగా కడిగి... కడిగిన నీటిని పక్కనపడేసి ఆ అటుకులను పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఆ అటుకుల్లో కాస్త ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు జోడించి మిక్స్ చేసుకోవాలి.
- Step 3
తర్వాత స్టౌ మీద ఒక గిన్నె పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడిచేయాలి.
- Step 4
వేడి అవుతుండగానే అందులో ఆవాలు వేయాలి. చిటపటలాడిన తర్వాత అందులో ఇంగువ, శెనగపప్పు, ఎండుమిర్చి, వేరుశెనగలు, ఉప్పు, కరివేపాకు తదితర పదార్థాలు వేసి వేగించుకోవాలి.
- Step 5
బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులను వేసి మిక్స్ చేసుకోవాలి.
- Step 6
ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పును సరిచూసుకుని ప్రతి 3 లేదా 5 నిముషాలకొకసారి కలుపుతూ ఉడికించాలి.
- Step 7
అంతే.. కొద్దిసేపు ఉడికిన అనంతరం అటుకుల పులిహోర తయారైపోతుంది.