- Step 1
మినపప్పు రెండు గంటలుపాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు కలిపి ఒక గంట నాననివ్వాలి. (బియ్యపు పిండి, మినపప్పు మిశ్రమంవీలు కాని వారు మైదా, చిటికెడు ఉప్పు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.)
- Step 2
తర్వాత పాన్‌లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, ద్రాక్ష, వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి.
- Step 4
పాలు ఇగిరిన తర్వాత పంచదార వేసచి అది కరిగి మళ్లీ బాగా దగ్గరయ్యే వరకూ ఉడికించాలి.
- Step 5
క్యారెట్ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి, దోరగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించి తీసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ పూర్ణాలు రెడీ.