- Step 1
జీడిపప్పు, బాదం వేయించి పొడి చేయాలి. మినప్పప్పు, బియ్యం నాలుగు గంటలు నానబెట్టాలి.
- Step 2
తరవాత సరిపడా నీటితో కాస్త ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి. పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బి ఇడ్లీల్లా వేసి ఆవిరి మీద ఉడికించి, చల్లారాక ముద్దలా చేయాలి.
- Step 3
పాన్‌లో బెల్లం తురుము, కొంచెం నీళ్లు పోసి కరిగించాలి.
- Step 4
ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు ముద్ద, పచ్చి కొబ్బరి తురుము, యాలకులపొడి, జీడిపప్పు, బాదం పప్పు పొడి, నెయ్యి కూడా వేసి కలపాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దల్లా చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేయించితే సరి.