- Step 1
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో, శెనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా మరియు సరిపడా నీళ్ళు పోసి మరీ చిక్కగా, మరీ పల్చగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఒక డీప్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి, వేడయ్యాక మంటను మీడియం తగ్గించి పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు ముందుగా పలచగా చక్రల్లా కట్ చేసి పెట్టుకొన్నపచ్చి అరిటికాయ ముక్కలను శెనగపిండి మిశ్రమంలో డిప్ చేసి అన్ని వైపులా శెనగపిండి అంటేలా డిప్ చేయాలి.
- Step 4
శెనగపిండిలో డిప్ చేసిన అరిటికాయ బజ్జీలను కాగుతున్న నూనెలో 4-6 వరకూ వేసి(సైజును బట్టి, కాగేనూనెలో వేయాలి) అవి బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
- Step 5
బజ్జీలు నూనెలో వేగుతున్నప్పుడు కాస్త మంటను పెంచుకోవచ్చు. అప్పుడు లోపలి భాగం కూడా పూర్తిగా ఉడుకుతుంది. అరటికాయ బజ్జీలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే వాటిని తీసి నూనె పీల్చుకొనే పేపర్ మీద ఒకటి రెండు నిముషాలు వేసి తర్వాత వెంటనే సర్వ్ చేయాలి. అంతే అరిటికాయ బజ్జీ రెడీ.