- Step 1
మటన్ ఖీమాను ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, సోంపు పొడి, సొంఠి పొడి, ఒక స్పూను ఆవాల నూనె, యాలకుల గింజలు వేసి బాగా కలపాలి.
- Step 2
ఇప్పుడు తయారైన ఈ పదార్ధంతో ఖీమా బాల్స్ తయారు చేసుకోవాలి. ఈ బాల్స్ గుండ్రంగా ఉండొచ్చు లేదా ఓవెల్ షేప్‌లో అయినా వుండొచ్చు.
- Step 3
కిలో ఖీమాని 35 నుంచి 40 బాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని, అందులో మిగిలిన ఆవాల నూనె పోయాలి.
- Step 4
సన్నటి మంట మీద నూనెను కాచి, దాంట్లో జీలకర్ర, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 50 మిల్లీ లీటర్ల నీటిని పోయాలి.
- Step 5
ఇప్పుడు అందులో ఉప్పు, కారం వేయాలి. ఈ పదార్ధం బాగా చిక్కబడేవరకూ ఉంచిన తర్వాత అందులో సిద్ధంగా వుంచుకున్న మటన్ ఖీమా బాల్స్ వేయాలి.
- Step 6
ఖీమా బాల్స్ సగమైనా మునగాలి. అలా కాకుండా చిక్కగా వుంటే, ఒక సగం గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు.
- Step 7
ఇప్పుడు పది నిమిషాలపాటు మూత పెట్టి మీడియం మంట మీద ఖీమాబాల్స్ బాగా ఉడకనివ్వాలి.
- Step 8
ఇప్పుడు గరమ్ మసాలా వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు పాన్ మీద మూత పెట్టి వుంచి కిందకి దించేయాలి. ఇప్పుడు తరిగి వుంచుకున్న కొత్తిమీరని పైన చల్లుకోవాలి.