- Step 1
మొదట బియ్యంను శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, యాలకను తుంచి వేసి ఒక ఫ్రై చేసుకోవాలి.
- Step 3
ఒక నిమిషం తర్వాత అందులో బియ్యం కూడా వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు, పచ్చిబఠానీలను కలుపుకోవాలి.
- Step 5
తర్వాత మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకుని, అందలో తరిగిన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి కలుపుకోవాలి.
- Step 6
ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, సరిపడా నీళ్ళు సోసి బాగా కలియబెట్టాలి.
- Step 7
ఇప్పుడు మంటను మీడియంగా పెట్టి 15నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 8
కిచిడి మెత్తబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- Step 9
అంతే ఆలూ కిచిడి రెడీ. దీనిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లవచ్చు.