- Step 1
ముందుగా ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్, గుడ్డు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను బాగా మిక్స్ చేసుకోవాలి.
- Step 2
అందులోనే గోరువెచ్చని నీరు పోసి బాగా కలుపుకోవాలి.
- Step 3
తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
- Step 4
ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకొని ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.
- Step 5
మీడియం మంట మీద చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి తీసి టిష్యు పేపర్ మీద వేసి పెట్టాలి.
- Step 6
ర్వాత మరో పాన్‌లో రెండు చెంచాలా నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేయాలి.
- Step 7
ఇందుకు పచ్చిమిర్చి కూడా జతచేసి, దోరగా వేపుకోవాలి.
- Step 8
ఇందులోనే సోయాసాస్, టమోటా కెచప్, అజినమోటా వేసి మరో నిమిషం పాటు వేపాలి.
- Step 9
కొత్తిమీర తరుగు వేసిమిక్స్ చేసి, అరకప్పు నీళ్ళు పోయాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 10
స్టౌను సిమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని దించేస్తే చికెన్ మంచూరియన్ రెడీ.