- Step 1
వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి.
- Step 2
చల్లారిన తరువాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి.
- Step 3
తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి.
- Step 4
వంకాయ గుజ్జును మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి.
- Step 5
ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒకొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలా కలపాలి.
- Step 6
చివరిగా ఉల్లి తరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.
- Step 7
సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
- Step 8
అంతే నోరూరించే వంకా బజ్జీ రెడీ.
- Step 9
ఇందులో నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి.