- Step 1
అరటి పండ్లను ఆవిరి మీద కొద్ది సేపు ఉంచాలి.
- Step 2
చల్లారాక తొక్క తీసి గుండ్రంగా ముక్కలు తరగాలి.
- Step 3
తరువాత బాణలిలో నెయ్యి కరిగించి అరటిపండు ముక్కలు, పంచార, యాలకుల పొడి, కొబ్బరి తరుము, జీడిపప్పు, ఎండుద్రాక్షా వేసి మూత పెట్టాలి.
- Step 4
నాలుగైదు నిమిషాలయ్యాక దించాలి. చల్లారాక చేత్తో మెదపాలి.
- Step 5
ఈ మిశ్రామాన్ని కావలసినంత సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి.
- Step 6
ఇప్పుడు మైదాలో కాసిని నీళ్లు ఉప్పి చేర్చి గరిటెజారుగా కలుపుకోవాలి.
- Step 7
ఈ పిండిలో అరటి పండు ఉండలను ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి దింపేయాలి.
- Step 8
అంతే రుచికరమైన బనానా రోల్స్ రెడీ.
- Step 9
వీటిని అరటి పండ్లను తినని చిన్నారు సైతం చక్కగా తినేస్తారు.
- Step 10
ఇవి పిల్లలకు బలవర్ధకమైనవి.