- Step 1
ఉడికించిన అన్నాన్ని చల్లార్చాలి.
- Step 2
క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోసు ఉంచాలి.
- Step 3
చల్లారిన అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి అందులో వెనిగర్, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, తురిమిన కొత్తిమీర వేసి చెక్క గరిటెతో నెమ్మదిగా కలపాలి.
- Step 4
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి, ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.
- Step 5
తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా అన్నంలో వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
- Step 6
వడ్డించేముందు ప్లేట్లలో సర్ది పైన ఇంకాస్త కొత్తిమీర చల్లితే మెక్సికన్ రైస్ సలాడ్ తయారైనట్లే...!