- Step 1
ముందుగా కోడిగుడ్లను దోరగా వేగినట్లు అట్టుపోసి పక్కనబెట్టుకోవాలి.
- Step 2
మరో నాలుగు కోడిగుడ్లను ఉడికించుకోవాలి. బియ్యాన్ని కడిగిపెట్టేసుకోవాలి. స్టౌ మీద పాన్‌ను పెట్టి వేడయ్యాక నూనె పోయాలి.
- Step 3
నూనె బాగా కాగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరంమసాలా వేసి బాగా కలపాలి.
- Step 4
ఈ మిశ్రమానికి కోడిగుడ్డు అట్టు ముక్కలు వేసి వేపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా అయ్యేవరకూ ఉడికించి దించేయాలి.
- Step 5
స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి.
- Step 6
బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
- Step 7
ఇవి వేగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి గరిటతో కలపాలి. ఇందులో గరంమసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కాసేపు బియ్యాన్ని వేగించుకోవాలి.
- Step 8
ఇందులో కోడిగుడ్డు ముక్కల కూర వేసి బాగా కలపాలి. వెజిటబుల్స్ ముక్కలు కూడా చేర్చి ఒక లీటరు నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 9
చివర్లో నెయ్యివేసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను ముక్కలుగా కోసి పలావుపైన గార్నిష్ చేయాలి.
- Step 10
అంతే వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ..