- Step 1
ముందుగా కుక్కర్లో చికెన్‌ను ఉడికించుకోవాలి.
- Step 2
తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్‌లో చికెన్ ముక్కలను వేరుగా తీసుకోవాలి.
- Step 3
చికెన్ ఉడికించిన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి.
- Step 4
పాన్‌లో కొద్దిగా బట్టర్ వేసి కరిగిన తర్వాత పెప్పర్ పొడి వేసి ఒక సెకన్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిముషాలు వేగించుకోవాలి.
- Step 5
ఇందులో మష్రుమ్ కూడా వేసి వేయించాలి.
- Step 6
అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ కాడలు, పక్కన పెట్టుకొన్న సన్నని చికెన్ పీసులు వేసి బాగా మిక్స్ చేసి 2నిముషాలు వేపుకోవాలి.
- Step 7
ఇందులో నాలుగు కప్పులు నీరు పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 8
ఉప్పు, కొత్తిమీర మిక్స్ చేసుకుని కాసేపు మంట మీద ఉంచి.. దించేస్తే చికెన్ మష్రూమ్ సూప్ రెడీ.
- Step 9
ఈ సూప్‌ను బౌల్‌లోకి తీసుకుని కార్న్ చిప్స్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.