- Step 1
స్టౌ వేడయ్యాక నెయ్యి వేసి.. అందులో రొయ్యలను దోరగా వేపుకుని బౌల్‌లోకి తీసుకోవాలి.
- Step 2
అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేగాక ఉల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి బ్రౌన్‌గా వేపుకోవాలి.
- Step 3
తర్వాత ఉడికించి పెట్టిన రెండు కప్పుల గోంగూరను చేర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం వేసి మూత పెట్టాలి.
- Step 4
కాసేపయ్యాక ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని చేర్చి బాగా కలపాలి.
- Step 5
రొయ్యలు ఉడికాక కొత్తిమీర తరుగు, కరివేపాకు చేర్చి దించేయాలి.
- Step 6
అంతే నోరూరించే గోంగూర రొయ్యల గ్రేవీ రెడీ.. ఈ కూర చపాతీల్లోకి లేదా వేడి వేడి రైస్‌లోకి సైడిష్‌గా యూజ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.